బసిరెడ్డిపల్లిలో పెద్దపులి కలకలం.. గోశాలలో ఆవుపై దాడి

కలం, వెబ్ డెస్క్ : వికారాబాద్ జిల్లా పరిగి మండలం బసిరెడ్డిపల్లి (Basireddipally) గ్రామం సమీపంలో పెద్దపులి కలకలం రేపింది. స్థానిక కృష్ణగిరి క్షేత్ర ఆలయ పరిధిలోని గోశాలలో ఉన్న గోవులపై పెద్దపులి దాడి చేయడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

మూడు రోజుల క్రితమే ఒక లేగదూడను ఎత్తుకెళ్లిన పులి, తాజాగా మరొక ఆవుపై దాడికి దిగింది. ఇది గమనించిన గో సంరక్షకుడు గట్టిగా కేకలు వేస్తూ పరుగెత్తడంతో పులి అక్కడి నుంచి పారిపోయింది. అయితే, ఈ దాడిలో ఆవు మెడ, ఉదర భాగంలో తీవ్ర గాయాలవ్వడమే కాకుండా వీపుపై పులి పంజా గుర్తులు పడ్డాయి. తీవ్రంగా గాయపడిన ఆవు కొద్దిసేపటికే మృతి చెందింది. పక్కనే ఉన్న ఒక ఫామ్‌హౌస్ సీసీ టీవీ కెమెరాల్లో పులి కదలికలు స్పష్టంగా రికార్డయ్యాయి.

గోశాలలో దాదాపు 200 వరకు ఆవులు ఉన్నాయని నిర్వాహకులు కృష్ణ స్వామి తెలిపారు. అటవీ శాఖ అధికారులు తక్షణమే స్పందించి పులిని బంధించి, సురక్షితంగా వేరే అడవిలో వదిలిపెట్టి గోశాలలోని ఇతర గోవులను, గ్రామస్థులను (Basireddipally Villagers) కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Also Read : గులాబీ మయమైన నెక్లెస్ రోడ్: క్యాన్సర్‌పై పోరులో ‘ పింక్ పవర్’ రన్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>