విజయవాడ బైపాస్‌లో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

కలం, వెబ్ డెస్క్ : విజయవాడ బైపాస్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం (Vijayawada Bypass Accident) చోటు చేసుకుంది. విజయవాడ నుండి ఏలూరు వైపు వెళ్తున్న కంటైనర్ లారీని వెనుక నుండి వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఒకేసారి పలువాహనాలు ఢీకొనడంతో రెండు లారీల మధ్య కారు నలిగిపోయింది. ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

ప్రమాద వివరాలు ఇలా ఉన్నాయి.. విజయవాడ నుంచి ఏలూరు వైపు వెళ్తున్న ఓ కారును కంటైనర్ లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పిన కారు ముందు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ లారీ కిందకు దూసుకెళ్లింది. రెండు లారీల మధ్య ఉన్న కారు పూర్తిగా నలిగిపోయి నుజ్జునుజ్జయిపోగా.. కారులో ఉన్న తల్లి, బిడ్డ అక్కడికక్కడే చనిపోయారు. మరోవ్యక్తికి రెండు చేతులు కోల్పోయి, తీవ్ర రక్తస్రాంతో కొట్టుమిట్టాడుతున్నారు. మరోవైపు అదుపుతప్పిన ఆయిల్ ట్యాంకర్ స్కూటర్ ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

Read Also: బీఆర్ఎస్ బరితెగించి మాట్లాడుతోంది: భట్టి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>