అఫ్గాన్‌కు భార‌త్ వైద్య సహాయంపై విజ‌య‌సాయి రెడ్డి పోస్ట్‌!

క‌లం, వెబ్ డెస్క్‌: కాబూల్‌లోని ఆసుపత్రిపై పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడుల్లో గాయపడిన అఫ్గాన్‌ వాసులను ఆదుకోవడానికి భారత్ 2.5 టన్నుల అత్యవసర మందులు స‌ర‌ఫ‌రా చేసింది. దీంతో పాటు వైద్య పరికరాలు కూడా పంపించింది. దీనిపై విజ‌య‌సాయిరెడ్డి (Vijayasai Reddy) ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ఒక నమ్మకమైన పొరుగు దేశంగా భారత్ తన మానవతా దృక్పథాన్ని చాటుకుందని, ఆపదలో ఉన్న అఫ్గాన్ (Afghanistan) ప్రజలకు మన దేశం ఎల్లప్పుడూ అండ‌గా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మానవత్వాన్ని విస్మరించి దాడులకు పాల్పడుతున్న పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా భారత్ బ‌లంగా నిలబడుతుందని, అఫ్గాన్ సోదరులకు ఇచ్చే ఈ మద్దతు భారత్ నిబద్ధతకు నిదర్శనమని ఆయన తన పోస్ట్‌లో కొనియాడారు.

Read Also: అమెరికా నుంచి ఎల్పీజీ దిగుమ‌తులు షురూ!

Follow Us On: Facebook

 

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>