అణు కేంద్రాలే లక్ష్యం: ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడి

కలం, వెబ్​ డెస్క్​ : మధ్యప్రాచ్యంలో యుద్ధం తీవ్రమవుతోంది. ఇజ్రాయెల్ అణు పరిశోధన కేంద్రాలే లక్ష్యంగా ఇరాన్ (Iran) భారీ క్షిపణి దాడులకు పాల్పడింది. ముఖ్యంగా ఇజ్రాయెల్ అణు పరిశోధన కేంద్రం సమీపంలోని డిమోనా, అరద్ ప్రాంతాలపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల ధాటికి భారీగా ఆస్తి నష్టం సంభవించడమే కాకుండా, పలువురు స్థానిక ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ అధికార వర్గాలు వెల్లడించాయి.

ఈ ఆకస్మిక దాడిని అడ్డుకోవడంలో ఇజ్రాయెల్ (Israel) సైన్యం విఫలమైంది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను అడ్డుకోలేకపోయామని ఇజ్రాయెల్ రక్షణ దళాలు స్వయంగా అంగీకరించాయి. అయితే, ఈ దాడికి కొన్ని గంటల ముందే ఇరాన్‌లోని నతాంజ్ అణు కేంద్రంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు నిర్వహించింది. దానికి ప్రతీకారంగానే ఇరాన్ (Iran) ఇప్పుడు ఈ క్షిపణి దాడులకు దిగినట్లు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న ఈ ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Read Also: రోడ్డు వెడల్పును బట్టి అంతస్తులు: కొత్త రూల్స్​ ఇవే!

Follow Us On: Pinterest

 

 

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>