తమిళ రాజకీయాల్లోకి త్రిష ఎంట్రీ.. విజయ్ కీలక నిర్ణయం!

కలం, వెబ్ డెస్క్: తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం దళపతి విజయ్ (Vijay-Trisha) పేరు మారుమోగుతోంది. 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తమిళగ వెట్రి కళగం (TVK) 108 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో చెన్నైలో తన పార్టీకి చెందిన నూతన ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో విజయ్ కీలక భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో టీవీకే శాసనసభాపక్ష నేతగా విజయ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నట్లు సమాచారం.

ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. విజయ్ రెండు చోట్ల (పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్) గెలిచారు. ఆయన రాజీనామా చేసే అవకాశం ఉన్న తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గం నుంచి ఉపఎన్నిక బరిలో నటి త్రిషను దించాలని పార్టీ యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమెకు ప్రభుత్వంలో కీలక పదవి ఇచ్చే అవకాశం ఉందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కాగా కేవలం 10 సీట్ల మెజారిటీ దూరంలో ఉన్న విజయ్‌కి మద్దతు ఇచ్చేందుకు అన్నాడీఎంకేకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే ఆయనతో టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>