Mobile Popup Ad
Mobile Popup Ad

ఎన్నాళ్లో వేచిన ఉదయం.. నేడే సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం

కలం, వెబ్ డెస్క్: తమిళనాడు కొత్త సీఎంగా టీవీకే అధినేత విజయ్ (Vijay) నేడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఉదయం 10 గంటలకు చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో అంగరంగ వైభవంగా ఈ వేడుక జరగబోతుంది. విజయ్‌తో పాటు మరికొందరు మంత్రులతో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ప్రమాణం చేయించబోతున్నారు. దీంతో, గత అయిదు రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడి.. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈ మేరకు నిన్ననే విజయ్ గవర్నర్ ను కలిసి తనకు 120 మంది సభ్యుల మద్దతు ఉందని జాబితా అందజేశారు. అనంతరం, వెంటనే గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆదేశిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు.

దళపతి నుంచి ముఖ్యమంత్రి వరకు..

తమిళ సినిమాల్లో చెరగని ముద్ర వేసిన విజయ్‌ను అభిమానులు దళపతి అని పిలుచుకుంటారు. రెండేళ్ల కిందట తమిళ వెట్రి కజగం పేరిట పార్టీ స్థాపించిన ఈ అగ్ర నటుడు.. అనతి కాలంలోనే ఎవరూ ఊహించని విధంగా డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలను చిత్తు చేసి.. ఏకంగా ముఖ్యమంత్రి అయిపోతున్నాడు. ఇంత తక్కువ సమయంలోనే ఉన్నత పీఠాన్ని అధిరోహించబోతున్న వ్యక్తిగా ఎంజీఆర్, ఎన్టీఆర్ సరసన నిలిచాడు. దీంతో, తమిళనాడు వ్యాప్తంగా నిన్నటి నుంచి పండగ వాతావరణం నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>