Mobile Popup Ad
Mobile Popup Ad

ఐబొమ్మ రవి కేసులో అదనపు చార్జ్‌షీట్ దాఖలు

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి(ibomma Ravi)పై కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు అడిషనల్ చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ చార్జ్‌షీట్‌లో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఐదు రోజుల పోలీస్ కస్టడీ విచారణ తర్వాత ఈ కొత్త ఆరోపణలు నమోదయ్యాయి. రవి మొత్తం 70కి పైగా మిర్రర్ డొమైన్లను కొనుగోలు చేసిన ఇన్‌వాయిస్‌లు, ఈ-మెయిల్ లింకులను స్వాధీనం చేసుకున్నారు. ప్రతి డొమైన్‌కు ప్రత్యేక కోడ్‌లు కేటాయించి, ట్రాకింగ్‌ను సులభతరం చేసుకున్నట్టు గుర్తించారు.

ఐబొమ్మ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన వెంటనే బెట్టింగ్ యాప్‌లకు ఆటోమాటిక్ రీడైరెక్ట్ అయ్యేవి. ఈ అక్రమ బెట్టింగ్ యాడ్‌ల ద్వారానే నెలకు రూ.11 నుంచి 15 లక్షల వరకు క్రిప్టోకరెన్సీ రూపంలో ఆదాయం సమకూరుతోందని రవి(ibomma Ravi) ఒప్పుకున్నాడు. పోలీసుల చేతికి చిక్కకుండా రవి అనేక షెల్ కంపెనీలు సృష్టించినట్టు తేలింది. అన్ని కంపెనీలూ ఈఆర్ ఇన్ఫోటెక్ అనే మెయిన్ కంపెనీతో అనుసంధానమై ఉన్నాయి. అమెరికాలో రిజిస్టరైన ఈ కంపెనీ పూర్తిగా రవికే చెందినదని పోలీసులు నిర్ధారించారు.

అరెస్టు సమయంలో రవి గంటసేపు ఇంటి నుంచి బయటికి రాకపోవడం పట్ల పోలీసులు అనుమానం వ్యక్తం చేయగా, బాత్‌రూమ్‌లో రెండు ల్యాప్‌టాప్‌లు, లేడీస్ డ్రెస్సింగ్ టేబుల్ కింద 18 హార్డ్ డిస్క్‌లు దాచినట్టు ఒప్పుకున్నాడు. ఈ హార్డ్ డిస్క్‌లలో 21,000కు పైగా పైరసీ సినిమాలు దొరికాయి. అదనంగా రవి ప్రహ్లాద్ కుమార్ పేరుతో ఫేక్ పాస్‌పోర్ట్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తయారు చేసుకున్నట్టు కొత్త ఆరోపణలు నమోదయ్యాయి. ఈ గుర్తింపు దొంగతనం (ఐడెంటిటీ థెఫ్ట్), ఫార్జరీ కింద కొత్త సెక్షన్లు జత చేశారు.

ప్రస్తుతం రవి చంచల్‌గూడ సెంట్రల్ జైలులో ఉన్నాడు. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా జాయిన్ అయి మనీలాండరింగ్, క్రిప్టో ట్రాన్స్‌ఫర్లపై దర్యాప్తు ప్రారంభించింది.

Read Also: ఐబొమ్మ కేసులో షాకింగ్‌ నిజాలు!

Follow Us on : Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>