Mobile Popup Ad
Mobile Popup Ad

చెన్నైలో ఇంట్రెస్టింగ్ సీన్.. లోక్‌భవన్ వరకు వెళ్లి విజయ్ యూటర్న్

కలం, వెబ్ డెస్క్: తమిళనాడు రాజకీయాలు గంటగంటకో మలుపు తిరుగుతున్నాయి. ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. టీవీకే చీఫ్ విజయ్‌కి తాజాగా వీసీకే మద్దతు ఇవ్వడంతో మ్యాజిక్  ఫిగర్ దాటింది. దీంతో విజయ్ తన పార్టీకి మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేల సంతకాలతో గవర్నర్ కార్యాలయానికి చేరుకున్నారు. కానీ గవర్నర్ అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. గవర్నర్ కార్యాలయానికి వెళ్లిన విజయ్ అక్కడ యూటర్న్ తీసుకున్నారు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

తమిళనాడులో తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత టీవీకే పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, స్వతంత్రంగా మెజార్టీ మార్క్‌కు కొద్దిగా దూరంలో నిలిచింది. ఈ క్రమంలో కాంగ్రెస్, వామపక్షాలు, అలాగే వీసీకే వంటి పార్టీలు మద్దతు ప్రకటించడంతో టీవీకే బలంగా ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న పరిస్థితి ఏర్పడింది. మొత్తం మద్దతుతో సంఖ్యాబలం 120కి చేరినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు అధికారిక అనుమతి కోరేందుకు విజయ్ చెన్నైలోని లోక్‌భవన్ (రాజ్ భవన్)కు వెళ్లారు. తన పార్టీకి మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేల సంతకాలు, మద్దతు లేఖలను గవర్నర్‌కు సమర్పించి ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించాలని భావించారు. అయితే అక్కడికి చేరుకున్న అనంతరం గవర్నర్ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని సమాచారం. దీంతో విజయ్ వెను దిరిగారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>