అంగన్వాడీ సమస్యలపై ఏఐటీయూసీ పోరుబాట

కలం, కరీంనగర్: సెప్టెంబర్ 6, 7, 8 తేదీలలో కరీంనగర్‌లో (Karimnagar) నిర్వహించనున్న ఏఐటీయూసీ (AITUC) రాష్ట్ర 4వ మహాసభలను విజయవంతం చేయాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటీయూసీ జిల్లా సమితి పిలుపునిచ్చింది. ఈ మేరకు శనివారం గణేష్‌నగర్‌లోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో ఏ. రజిత అధ్యక్షతన జిల్లా సమితి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఏ. రజిత, ప్రధాన కార్యదర్శి డి. రజిత మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని రంగాల కార్మికులు, ఉద్యోగుల సమస్యలపై ఏఐటీయూసీ అనేక పోరాటాలు నిర్వహించి హక్కులు సాధించేందుకు కృషి చేసిందన్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాల సమస్యలపై కూడా రాష్ట్రవ్యాప్తంగా అనేక ఉద్యమాలు నిర్వహించి పలు హక్కులను సాధించుకున్నామని తెలిపారు.

అంగన్వాడీలకు కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలి

రానున్న రోజుల్లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు కనీస వేతనం రూ.18 వేలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే పెన్షన్, గ్రాట్యుటీ సౌకర్యాలను కల్పించాలని, అంగన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర మహాసభలలో పలు తీర్మానాలు చేయనున్నట్లు తెలిపారు.

మహాసభలకు భారీగా తరలిరావాలి

సెప్టెంబర్ 6, 7, 8 తేదీలలో కరీంనగర్‌లో జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర 4వ మహాసభలకు జిల్లాలోని అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య, అంగన్వాడీ యూనియన్ నాయకులు అరుణ, భారతి, భూలక్ష్మి, అరవింద, కవిత, అనంతలక్ష్మి, అండాలు, సునీత, రజిత, సరోజన, శారద తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>