Mobile Popup Ad
Mobile Popup Ad

రష్మికతో పెళ్లి.. ఫస్ట్ టైమ్ పోస్టు పెట్టిన విజయ్..

కలం, డెస్క్ : మొత్తానికి రష్మికతో పెళ్లిపై విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఫస్ట్ టైమ్ స్పందించాడు. తన ఇన్ స్టా వేదికగా పోస్టు పెట్టాడు. విజయ్ (Vijay Deverakonda) తన అభిమానులను ఉద్దేశించి చేసిన పోస్టులో ఏముందంటే.. ‘మేం ఏదైనా ప్లాన్ చేయాలి అనుకున్నప్పుడు, ఏదైనా మా కోసం సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటే అక్కడ మీరే ఉంటున్నారు. అన్నీ రెడీ చేస్తున్నారు. ఇప్పుడు మమ్మల్ని ఎంతో ప్రేమతో విరోష్ అని పిలుస్తున్నారు. కాబట్టి ఈ వెడ్డింగ్ కు విరోష్ అని పేరు పెడుతున్నాం. మీ ప్రేమకు ధన్యవాదాలు, మీరు మాలో ఎప్పటికీ భాగమే’ అంటూ రాసుకొచ్చాడు విజయ్.

చాలా కాలంగా రష్మికతో విజయ్ లవ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ జంట ఎక్కడకు వెళ్లినా సరే ఫ్యాన్స్ కనిపెట్టేస్తుంటారు. వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్టు ఎన్నో సార్లు హింట్ ఇచ్చారు. కానీ ఎన్ని సార్లు అడిగినా బయటకు చెప్పలేదు. రీసెంట్ గానే సీక్రెట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకుంది ఈ జంట. ఇప్పుడు పెండ్లికి రెడీ అయింది. ఫిబ్రవరి 26న ఈ జంట రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ లో ఒక్కటి కాబోతోంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ నుంచి సినీ ప్రముఖులు హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది. పెళ్లి తర్వాత హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ పార్టీ అరేంజ్ చేస్తోంది ఈ జంట.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>