20సార్లు తప్పించుకొని.. 21వ సారి హతం

కలం, వెబ్​ సైట్​: ఐదేళ్ల కిందట అక్రమంగా దేశంలోకి చొరబడ్డాడు.. అనేక హింసాత్మక ఘటనల్లో భాగమయ్యాడు.. కొంతమంది మరణానికి కారణమయ్యాడు.. భద్రతా దళాల నుంచి ఒకటీ రెండూ కాదు ఏకంగా 20సార్లు తప్పించుకున్నాడు.. చివరికి పాపం పండింది.. 21వ సారి చావు నుంచి తప్పించుకోలేకపోయాడు.. భారత దళాల చేతిలో హతమయ్యాడు(Trashi-I). ఆదివారం జమ్మూకాశ్మీరులో జరిగిన ఎన్​కౌంటర్​లో మోస్ట్​ వాంటెడ్​ జైషే ఉగ్రవాది సైఫుల్లాతోపాటు మరో టెర్రరిస్ట్​లను భారత దళాలు మట్టుబెట్టాయి.

స్థానిక పోలీసులు, భద్రతా దళాలు చెప్పిన వివరాల ప్రకారం.. కిష్త్​వార్​ ప్రాంతంలోని కొండల్లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భారత భద్రతా బలగాలు ఆపరేషన్​ త్రాషి(Trashi-I) పేరుతో సెర్చింగ్​ మెదలుపెట్టాయి. ఈ క్రమంలో పసేర్​కుట్​లోని ఓ గుడిసెలో టెర్రిరిస్ట్​లు దాక్కొని ఉన్నట్లు గుర్తించాయి. వెంటనే ఆ ఇంటిని చుట్టుముట్టాయి. అయితే, భద్రతా దళాల రాకను పసిగట్టిన ముష్కరులు కాల్పులు ప్రారంభించారు. భారత దళాల ఎదురుకాల్పుల్లో వాళ్లు అక్కడికక్కడే మరణించారు. కాల్పుల్లో ఇల్లు తగలబడడంతో మృతదేహాలకు బాగా కాలిపోయాయి. సంఘటన స్థలం నుంచి ఏకే 47 తుపాకీలతోపాటు మరికొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

కాగా, ఉగ్రవాదుల వెతుకులాటలో ఆర్మీలోని పారా 2 విభాగానికి చెందిన టైసన్​ అనే జర్మన్​ షెఫర్డ్​ సైనిక డాగ్​ గాయపడింది. గుడిసెలోని తీవ్రవాదులు నక్కి, భారత దళాలపై కాల్పులకు సిద్ధమవుతుండడం గుర్తించిన టైసన్​.. బలగాలను హెచ్చరించే ప్రయత్నంలో గట్టిగా మొరిగింది. దీంతో దుండగులు గురి టైసన్​ తిప్పి వైపు కాల్పులు జరిపారు. బుల్లెట్లు​ తగలడంతో టైసన్​కు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>