కలం, ఉట్నూర్: ఉట్నూర్ మండలంలోని ఎందా (Yenda) గ్రామపంచాయతీకి చెందిన బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో ఉట్నూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభాకర్, ఎందా గ్రామ సర్పంచ్ రాథోడ్ కిరణ్, గ్రామ అధ్యక్షుడు రాథోడ్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

