ఉచిత విద్యుత్ సమస్యలపై కలెక్టర్‌ సమీక్ష

కలం, ఆదిలాబాద్: రజక, నాయీబ్రాహ్మణుల ఉచిత విద్యుత్ సమస్యలను (Free Electricity Issues) వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో రజక, నాయీబ్రాహ్మణుల సంఘాల ప్రతినిధులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రజక, నాయీబ్రాహ్మణులకు ప్రభుత్వం అందిస్తున్న 250 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం అమలు, కొత్త దరఖాస్తులు, షాపుల మార్పు సమయంలో తలెత్తుతున్న పెండింగ్ బిల్లుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. వృత్తిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను క్షుణ్ణంగా పరిశీలించి, ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన పరిష్కారం చూపాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి సోనియా, విద్యుత్ శాఖ ఎస్‌ఈ సుభాష్, జిల్లా పంచాయతీ అధికారి రమేష్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, బీసీ, నాయీబ్రాహ్మణ, రజక సంఘాల ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>