బాసర అమ్మవారి హుండీలో భారీ ఆదాయం

కలం, బాసర: నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో భక్తులు సమర్పించిన హుండీ (Basara Temple Hundi) కానుకల లెక్కింపును శనివారం నిర్వహించారు. ఆలయ ఈవో అంజనీదేవి, పర్యవేక్షకులు గంగా శ్రీనివాస్ సమక్షంలో హుండీ లెక్కింపు చేపట్టారు. గత 93 రోజులుగా భక్తులు సమర్పించిన నగదు, బంగారం, వెండి కానుకలను లెక్కించగా మొత్తం రూ.68,54,867 ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే 50 గ్రాముల మిశ్రమ బంగారం, కిలో 650 గ్రాముల మిశ్రమ వెండి, 55 విదేశీ కరెన్సీ నోట్లు లభించినట్లు తెలిపారు. హుండీ లెక్కింపు సందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సహాయ కార్యనిర్వహణ అధికారి గంగా శ్రీనివాస్, దేవస్థాన పర్యవేక్షకులు శివరాజ్, సంజీవరావు, వాగ్దేవి సొసైటీ సభ్యులు, శివరామకృష్ణ భజనమండలి సభ్యులు, దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>