కలం, వెబ్ డెస్క్: ప్రముఖ సినీనటుడు గిరిబాబు (Actor Giribabu) అంత్యక్రియలు ఆదివారం జరుగనున్నాయి. ఏపీలోని ప్రకాశం జిల్లా రావినూతలలో మధ్యాహ్నం అంతిమ సంస్కారం నిర్వహించనున్నారు. గిరిబాబు (83)కు ఆ గ్రామమంటే ఎంతో ఇష్టమని.. తన చివరి కోరికకూడా ఆ గ్రామంలోనే అంత్యక్రియలు నిర్వహించాలని కోరడంతో కుటుంబ సభ్యులు రావినూతలలోనే చివరి వీడ్కోలు పలుకానున్నారు. తమకు సెలవులు వచ్చినప్పుడల్లా ఎక్కువ సమయం స్వగ్రామంలోనే గడిపేవారని చెప్పుకొచ్చారు.
అనారోగ్య సమస్యలతో గిరిబాబు శనివారం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.1946 జూన్ 8న ప్రకాశం జిల్లా రావినూతలలో జన్మించిన గిరిబాబు.. తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నారు. నటుడిగా సినీ ప్రేక్షకులను మెప్పించారు. తన కెరీర్లో 600కి పైగా సినిమాల్లో నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్, విలన్గా ఎన్నో పాత్రలు చేశారు. అంతేకాకుండా కొన్ని చిత్రాలకు దర్శకత్వం, మరికొన్ని సినిమాలకు నిర్మాతగా సైతం వ్యవహరించారు. గిరిబాబు కొడుకు రఘుబాబు సైతం కమెడియన్గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా, గిరిబాబు ఇక లేరు అని తెలుసుకున్న సినీ ప్రముఖులు.. ఆయనకు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

