మున్సిపల్ ఎన్నికలు: నేడు రెండో రోజు నామినేషన్లు

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లోని 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల (AP Municipal Elections) సమరం వేడెక్కింది. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నేడు రెండో రోజు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. తొలి రోజు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 274 నామినేషన్లు దాఖలు కాగా, ఇందులో మేయర్, చైర్‌పర్సన్ స్థానాలకు 16, డిప్యూటీ మేయర్లు అలాగే వార్డు సభ్యుల స్థానాలకు 258 నామినేషన్లు అందినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటివరకు తమ అభ్యర్ధులను అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ, ఆశావహులు మరియు స్వతంత్ర అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. నామినేషన్ల స్వీకరణకు రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే గడువు ఉండటంతో రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల వద్ద సందడి నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>