చందన కుటుంబానికి బాసటగా తీన్మార్ మల్లన్న.. రూ.50 వేల ఆర్థిక సాయం!

కలం, తిరుమలగిరి : నిన్న రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మెడబోయిన చందన కుటుంబానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) అండగా నిలిచింది. శుక్రవారం వలిగొండ – తిరుమలగిరి హైవేపై అన్నోజిగూడ స్టేజి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చందన మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషాద వార్త తెలుసుకున్న పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (Teenmaar Mallanna) ఆదేశాల మేరకు శనివారం పార్టీ రాష్ట్ర నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

పార్టీ రాష్ట్ర కార్యదర్శి పిట్టల శంకర్ ఆధ్వర్యంలో నాయకులు చందన నివాసానికి చేరుకుని, కుటుంబ సభ్యులను ఓదార్చారు. తక్షణ ఆర్థిక సాయంగా రూ.50 వేల నగదును బాధిత కుటుంబానికి అందజేశారు. అనంతరం చందన అంత్యక్రియలలో పాల్గొని నివాళులర్పించారు. ఇంటి ఆడబిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులకు నాయకులు మనోధైర్యం కల్పించారు. భవిష్యత్తులోనూ పార్టీ తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పార్టీ మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజక్క, రాష్ట్ర కార్యదర్శి పిట్టల శంకర్, బసపురం నాగేష్ ముదిరాజ్, రమేష్ యాదవ్, బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ గౌరవ అధ్యక్షుడు దేవళ్ల సమ్మయ్య, రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ అరుణ్ పటేల్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరసింహ, ఉపాధ్యక్షుడు సుధాకర్, జనగామ నియోజకవర్గ ఇన్‌చార్జి భిక్షపతి, సీనియర్ జర్నలిస్ట్ సుదర్శన్ గౌడ్, నాయకులు వీరేందర్, మెదక్ జిల్లా సోషల్ మీడియా అధ్యక్షుడు సురేష్ ముదిరాజ్, సుశీల తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>