ప్రధాని నివాసానికి కామన్వెల్త్ విజేతలు!

కలం, వెబ్ డెస్క్​ : గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026 లో పతకాలు సాధించిన భారతీయ అథ్లెట్లు (CWG Winners) న్యూఢిల్లీలోని 7 లోక్ కల్యాణ్ మార్గ్‌లో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారిక నివాసానికి చేరుకుంటున్నారు. భారత క్రీడాకారుల అద్భుత విజయం ఈ క్రీడల్లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. మొత్తం 39 పతకాలతో పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచారు. మన క్రీడాకారులు 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్య పతకాలను దేశానికి అందించారు.

విజేతలకు ప్రధాని సత్కారం..

దేశ ప్రతిష్టను అంతర్జాతీయ వేదికపై నిలబెట్టిన విజేతలను నేరుగా అభినందించేందుకు ప్రధాని మోదీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అథ్లెట్ల ప్రతిభను కొనియాడుతూ వారిని ప్రత్యేకంగా సత్కరించనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>