కలం, వెబ్ డెస్క్ : భూమ్మీద నూకలు ఇంకా మిగిలి ఉండడం అంటే ఇదేనేమో. వెనిజులాలో సంభవించిన భూకంపం (Venezuela Earthquake) లో ఓ బాలుడు మృత్యువును జయించాడు. భూకంపం సంభవించిన నాలుగు రోజుల తర్వాత అతడిని రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా కాపాడాయి.
ఇప్పటివరకు ఈ భూకంపం (Venezuela Earthquake) లో 1,400 మందికిపైగా మృతి చెందినట్లు సమాచారం. మరోవైపు, పలువురు శిథిలాల కింద నుంచి ప్రాణాలతో బయటపడుతున్నారు. శిథిలాల కింద చిక్కుకుని ప్రాణాల కోసం పోరాడుతున్న వారిని గుర్తించి రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొస్తున్నారు.
ఈ విపత్తు కారణంగా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వెనిజులా అధికారులు తెలిపారు. 4 వేల మందికిపైగా గాయపడగా, 10 వేలకుపైగా కుటుంబాలు భూకంప ప్రభావానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు సహాయక బృందాలు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నట్లు వెనిజులా అధ్యక్షుడు జార్జ్ రోడ్రిగ్జ్ తెలిపారు.
Read Also: అమ్రాబాద్ అడవుల్లో అరుదైన అతిథి!
Follow Us On: X(Twitter)

