కలం, సినిమా : ENE Repeat | టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) తెరకెక్కించిన కల్ట్ క్లాసిక్ ‘ఈ నగరానికి ఏమైంది’ (Ee Nagaraniki Emaindi) మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2018లో విడుదలైన ఈ సినిమా బిగ్ స్క్రీన్, ఓటీటీ, రీ రిలీజ్‌లో సైతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
ఈ చిత్రానికి యూత్ ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని దర్శకుడు ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ రూపొందిస్తున్నట్లు గతంలో ప్రకటించారు. ‘ENE Repeat’ క్రేజీ టైటిల్‌తో వస్తున్న ఈ సీక్వెల్ మూవీ విడుదల తేదీని తాజాగా చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. తొలి చిత్రం విడుదలై 8 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా, 2026 నవంబర్ 19న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. “రేయ్.. మనం కలిసి తాగి 8 ఏళ్లు అయింది రా. నవంబర్ 19న కలుద్దాం.. మళ్లీ తాగుదాం. ఇజ్ దట్ క్లియర్?” అనే ఫేమస్ డైలాగ్‌ను గుర్తు చేస్తూ రిలీజ్ చేసిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రంలో నటించిన విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను మరోసారి తమ పాత్రలలో కనిపించనున్నారు.
అయితే ఈ సీక్వెల్ మూవీలో సాయి సుశాంత్ పాత్రలో మాగంటి శ్రీనాథ్ నటిస్తున్నారు. ఎస్ ఒరిజినల్స్ (S Originals), రూట్‌నోడ్ సినిమా (Rootnode Cinema) బ్యానర్స్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. స్నేహం, హాస్యం, భావోద్వేగాలతో ప్రేక్షకులను అలరించిన తొలి చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న ‘ENE Repeat’పై ఇప్పటికే సినీ వర్గాలతో పాటు అభిమానులలో కూడా ఆసక్తి నెలకొంది.
Read Also: దాంపత్య జీవితంలో గొడవలు తగ్గించుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి
Follow Us On: Instagram

