ఎర్రజొన్న, మొక్కజొన్న రైతులకు న్యాయం చేయాలి : ఎమ్మెల్యే వేముల

కలం, నిజామాబాద్ బ్యూరో : తెలంగాణ శాసనసభ జీరో అవర్ లో నిజామాబాద్ జిల్లా బాల్కొండ ఎమ్మెల్యే వేముల (Vemula) ప్రశాంత్ రెడ్డి రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో ప్రధానంగా సాగయ్యే ఎర్రజొన్న, మొక్కజొన్న పంటల మద్దతు ధర యాప్ తో, యూరియా పంపిణీలో జరుగుతున్న ఆలస్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో ప్రత్యేకంగా పండించే ‘ఫోడర్ జవార్’ (ఎర్రజొన్న) వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతులకు అన్యాయం చేస్తున్నారని వేముల (Vemula) ఆవేదన వ్యక్తం చేశారు.

గతేడాది క్వింటాల్‌కు రూ.3,800 పలికిన ధర, ఈ ఏడాది సాగు విస్తీర్ణం తగ్గినప్పటికీ వ్యాపారులు కుమ్మక్కై రూ.3వేలకు తగ్గించారని వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. దీనివల్ల ఎకరాకు రూ.10 వేల వరకు రైతులకు నష్టం వాటిల్లుతోందని, వెంటనే కలెక్టర్ జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించి ఎర్రజొన్న రైతులకు మద్ధతు ధర లభించేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు మొక్కజొన్న క్వింటాల్‌కు రూ.500 బోనస్ వెంటనే ఇవ్వాలని కోరారు.

ప్రస్తుతం మార్కెట్‌లో మద్దతు ధర రూ. 2,400 ఉండగా, కొనుగోలు కేంద్రాలు లేక రైతులు రూ. 1,600-1,700 కే అమ్ముకుంటున్నారని.. దీని వల్ల ఎకరాకు రూ.32 వేల దాకా నష్టపోతున్నారని గణాంకాలతో వివరించారు. ప్రభుత్వం తక్షణమే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని కోరారు. యూరియా కోసం తెచ్చిన యాప్ ను వేముల ప్రశాంత్ రెడ్డి తప్పుబట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో 75% మంది రైతులకు అసలు స్మార్ట్ ఫోన్లు వాడటం రాదని చెప్పారు. రైతుల మనోభావాలను ప్రతిబింబిస్తూ.. “కేసీఆర్ ఉన్నప్పుడు ఆటో వాడికి డబ్బులిస్తే పొలం దగ్గరికి యూరియా సంచులు వచ్చేవి, ఇప్పుడు ఈ యాప్‌లు, తిప్పలు ఎందుకుఅన్నారు వేముల.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>