Mobile Popup Ad
Mobile Popup Ad

రాజ్య‌స‌భకు నామినేష‌న్ దాఖ‌లు చేసిన వేం నరేందర్ రెడ్డి, సింఘ్వీ

క‌లం, వెబ్ డెస్క్‌: తెలంగాణ నుంచి రాజ్యస‌భ‌కు కాంగ్రెస్ అభ్య‌ర్థులుగా వేం నరేందర్ రెడ్డి (Vem Narender Reddy), అభిషేక్ మను సింఘ్వీ (Abhishek Singhvi) 3వ సెట్‌ నామినేష‌న్ దాఖ‌లు చేశారు. మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో ఎన్నికల అధికారి ఉపేందర్ రెడ్డికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్య‌క్ర‌మానికి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఇద్ద‌రికి పార్టీ నేత‌లంతా శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా వేం న‌రేంద‌ర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ఈ అవ‌కాశం క‌ల్పించిన పార్టీ హై క‌మాండ్‌తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్‌గౌడ్‌, డిప్యూటీ సీఎం భ‌ట్టి, పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. పార్టీ ఆశీర్వాద‌మే త‌న బ‌ల‌మ‌ని వేం న‌రేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. త‌న‌కు మ‌రోసారి రాజ్య‌స‌భ‌ అవ‌కాశం క‌ల్పించినందుకు అభిషేక్ మ‌ను సింఘ్వీ పార్టీ హైక‌మాండ్‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>