Mobile Popup Ad
Mobile Popup Ad

ఇంట్రెస్టింగ్ గా నాగచైతన్య వృషకర్మ గ్లింప్స్..

కలం, వెబ్ డెస్క్ : నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ వృషకర్మ (Vrushakarma). కార్తీక్ దండు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. తాజాగా మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది. రెండు నిముషాల 9 సెకన్ల పాటు కట్ చేసిన ఈ గ్లింప్స్ ఆద్యంతం సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగింది. విరూపాక్ష మూవీలాగే ఇది కూడా పూర్తి మైథలాజికల్ థ్రిల్లర్ గానే సాగుతోంది. మనుషులు సడెన్ గా చచ్చిపోవడం.. దాన్ని హీరో ఎలా అడ్డుకున్నాడు అనే కోణంలో ట్విస్టులతో సినిమాను తెరకెక్కించినట్టు గ్లింప్స్ చూస్తేనే అర్థం అవుతుంది. వృషకర్మ లో నాగచైతన్య అర్జున్ అనే నిధి అణ్వేషకుడిగా కనిపించబోతున్నాడు. అజనీష్‌ అందించిన బీజీఎం కూడా ఆకట్టుకుంటోంది.

గ్లింప్స్ చూస్తుంటే నాగచైతన్య (Naga Chaitanya) పాత్రను చాలా సీరియస్ గా డిజైన్ చేసినట్టే కనిపిస్తోంది. ఇందులో మీనాక్షి చౌదరి పాత్రను అలా ఒకసారి చూపించారు. ఈ కథ మొత్తం విలేజ్ బ్యాక్ డ్రాప్ లోనే రూపు దిద్దుకుంటోంది. మిస్టరీల నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ గా సాగే మూవీ (Vrushakarma) లైన్ లో దీన్ని రూపొందించారు. విరూపాక్షతో భారీ హిట్ అందుకున్న కార్తీక్.. ఈ మూవీతో మరోసారి అలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారా లేదా అనేది చూడాలి.

Read Also: బాలకృష్ణ సినిమాలో విలన్‌గా మంచు మనోజ్ ?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>