కలం, కరీంనగర్: కరీంనగర్ లోని జ్యోతినగర్‌లో ఉన్న హనుమాన్ సంతోషి మాత ఆలయాన్ని కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు (Velichala Rajender Rao) శుక్రవారం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ కమిటీ ప్రతినిధులు రాజేందర్‌రావును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంతోషిమాత ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించిన కరపత్రాన్ని రాజేందర్‌రావు ఆవిష్కరించారు. ఆలయ పునర్నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తూ అవసరమైన కృషి చేస్తానని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న, కార్పొరేటర్ పడాల శ్రీజ అజయ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ధర్మారం వెంకటస్వామి, మాజీ కార్పొరేటర్ వాల రమణారావు, కాంగ్రెస్ నాయకులు, ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

