కలం, కరీంనగర్: భక్తి శ్రద్ధలతో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని.. ప్రజల సుఖసంతోషాలను కాంక్షిస్తూ వెలిచాల రాజేందర్‌రావు (Velchala Rajender), రేఖ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరీంనగర్ మార్కెట్ రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని శనివారం సందర్శించిన కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. అర్చకులు ఆలయ సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
అనంతరం వెలిచాల దంపతులు ఆలయానికి వచ్చిన భక్తులకు స్వయంగా ప్రసాదం పంపిణీ చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో కరీంనగర్ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు రాజేందర్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

