విశాఖ విశ్వ నగరంగా మారుతుంది : సీఎం చంద్రబాబు

కలం, వెబ్ డెస్క్ : విశాఖపట్నంలో నిర్వహించిన పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) పేదలకు ఆస్తి హక్కు పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. రాజముద్ర వేసి ప్రజలకు.. స్వేచ్ఛగా బతకాలనే ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రకు రెండేళ్లలో 91 కొత్త ప్రాజెక్టులు రావడంతోపాటు రూ.5.37 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు ఆయన వెల్లడించారు.

పోలవరం లెఫ్ట్ కెనాల్ ద్వారా అనకాపల్లికి నీళ్లు తీసుకొచ్చామని.. కెనాల్‌ను పూర్తి చేసి త్వరలో విశాఖకు గోదావరి నీళ్లు తీసుకొస్తామని సీఎం ప్రకటించారు. రాబోయే రోజుల్లో విశాఖపట్నం విశ్వ నగరంగా మారుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అల్లూరి విమానాశ్రయంతో ఉత్తరాంధ్ర కలలకు రెక్కలొచ్చాయన్నారు. టూరిజం, లాజిస్టిక్స్ హబ్ గా విశాఖ మారనుందని చెప్పారు. విశాఖకు హైవేలు, పోర్టులు, విమానాశ్రయాలు వచ్చాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>