కబ్జా ఆరోపణలు.. సినీ నిర్మాతపై పీఎస్ లో ఫిర్యాదు!

కలం, వెబ్ డెస్క్ : సినీ ప్రొడ్యూసర్ సి. కళ్యాణ్‌ (C Kalyan)పై మాదాపూర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. మాదాపూర్ సున్నం చెరువు ప్రాంతంలో తమ భూమిని అక్రమంగా కబ్జా చేశారని సియాట్ సొసైటీ అధ్యక్షుడు శ్యామ్ సింగ్ పోలీసులకు పిర్యాదు చేశారు.

గుట్టల బేగంపేట్ పరిధిలోని సర్వే నంబర్లు 12, 12ఏ, 13లలో తమ ప్లాట్లు ఉన్నాయని బాధితులు తెలిపారు. ఈ ఉదయం నిర్మాత సి. కళ్యాణ్ తన అనుచరులతో కలిసి తమ ప్లాట్లలోకి అక్రమంగా ప్రవేశించి బ్లూ షీట్లు వేసి ఆక్రమణకు పాల్పడ్డారని పిర్యాదులో పేర్కొన్నారు. తాము తమ సొంత ప్లాట్లలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ప్లాట్ ఓనర్లు ఆరోపించారు.

గతంలో కూడా కొందరు వ్యక్తులు తమ ప్లాట్లను కబ్జా చేసేందుకు ప్రయత్నించారని, ఆ సమయంలో పోలీసులకు పిర్యాదు చేయడంతో వారు వెనక్కి తగ్గారని సొసైటీ సభ్యులు తెలిపారు. తాజాగా మళ్లీ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్న ప్రొడ్యూసర్ సి. కళ్యాణ్, ప్రకాష్ ధారక్, ప్రేమలతలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్లాట్ ఓనర్లు మాదాపూర్ పోలీసులను కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>