కలం, వెబ్ డెస్క్ : తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో తిరుమల ఘాట్ రోడ్డు వాహనాలతో కిక్కిరిసిపోయింది. శనివారం సాయంత్రం శ్రీవారి ఆలయంలో గరుడ వాహన సేవ (Garuda Vahana Seva) జరగనున్న నేపథ్యంలో భక్తుల రద్దీ మరింత పెరిగింది. రద్దీ దృష్ట్యా కొండపైకి ప్రైవేట్ వాహనాల రాకపోకలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. అలిపిరి నుంచి తిరుమలకు ఆర్టీసీ బస్సులను మాత్రమే అనుమతిస్తున్నారు. తిరుమలలో పార్కింగ్ పరిస్థితిని సర్దుబాటు చేసిన తర్వాతే ప్రైవేట్ వాహనాలను కొండపైకి అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు. రద్దీ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భక్తులు సహకరించాలని టీటీడీ అధికారులు సూచించారు.

