కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ (DG)గా సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ (VC Sajjanar) గురువారం బాధ్యతలు స్వీకరించారు.
గతంలో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తించిన ఆయనను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఫైర్ డిపార్ట్మెంట్ కు బదిలీ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ బదిలీ ఉత్తర్వులు వెలువడిన తర్వాత కొంత విరామం తీసుకున్న సజ్జనార్, గురువారం ఉదయం ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం కార్యాలయానికి చేరుకుని బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా శాఖాపరమైన అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ ఫైర్ డిపార్టుమెంట్ పనితీరు, విపత్తు నిర్వహణ రాబోయే రోజుల్లో శాఖలో చేపట్టబోయే కీలక అంశాలపై వివరించారు.

