‘దళపతి’ సీన్‌ను రీక్రియేట్ చేసిన అనిల్ రావిపూడి

కలం, సినిమా: దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi), హీరోయిన్ కృతి శెట్టి కలిసి సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన క్లాసిక్ చిత్రం ‘దళపతి’లోని ఒక ఐకానిక్ సన్నివేశాన్ని సరదాగా రీక్రియేట్ చేశారు. తన చిత్రం ‘జనవరి 12 విడుదల’ మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ప్రారంభించేందుకు ఈ ప్రత్యేక ప్రోమోను విడుదల చేశారు. ‘దళపతి’ సినిమాలో రజనీకాంత్, శోభనల మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాన్ని అనిల్ రావిపూడి తనదైన కామెడీ టచ్‌తో మార్చి చిత్రీకరించారు. ఈ ప్రోమోలో హీరోయిన్లు కీర్తి సురేష్, కృతి శెట్టి తనను పక్కన పెట్టి రీల్ చేయాలనుకోవడంతో అనిల్ రావిపూడి నిరాశపడినట్లు సరదాగా చూపించారు.

నవంబర్ 20 నుంచి సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలవుతాయని చిత్రబృందం వెల్లడించింది. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ బావబామ్మర్దులుగా నటిస్తుండగా.. కీర్తి సురేష్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ నిర్మిస్తుండగా, సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12, 2027న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>