నిర్మల్ మున్సిపాలిటీలో కొలిక్కిరాని ఫ్లోర్ లీడర్ ఎంపిక..

కలం, నిర్మల్ : మున్సిపల్ ఎన్నికలు ముగిసి పది నెలలు గడుస్తున్నా నిర్మల్ మున్సిపాలిటీలో బీజేపీ ఫ్లోర్ లీడర్ (BJP Floor Leader) ఎంపిక మాత్రం కొలిక్కి రావడం లేదు. ఎన్నికల్లో 13 మంది కౌన్సిలర్లు గెలుపొందడంతో మున్సిపల్ కౌన్సిల్‌లో బలమైన ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ఫ్లోర్ లీడర్‌ను నియమించకపోవడం చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో పార్టీ తరఫున ప్రజా సమస్యలను ప్రస్తావించడంతోపాటు, అధికార పక్ష నిర్ణయాలపై ప్రశ్నించేందుకు, సభ్యుల మధ్య సమన్వయం సాధించేందుకు ఫ్లోర్ లీడర్ కీలకంగా వ్యవహరిస్తారు.

అలాంటి బాధ్యతాయుతమైన పదవికి ఇంతకాలం నియామకం జరగకపోవడంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. బీజేపీ తరఫున గెలుపొందిన 13 మంది కౌన్సిలర్లలో 12 మంది తొలిసారి ఎన్నికైనవారు కాగా, సాదం స్వప్నకు మూడుసార్లు కౌన్సిలర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. దీంతో అనుభవం, పార్టీ విధేయత, స్థానిక రాజకీయ సమీకరణాలు ఫ్లోర్ లీడర్ ఎంపికలో కీలకంగా మారనున్నాయి.

జిల్లా పార్టీ అధ్యక్షుడితోపాటు స్థానిక ఎమ్మెల్యే అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నియామకం చేపట్టాల్సి ఉన్నప్పటికీ, నిర్ణయం మాత్రం వాయిదా పడుతూ వస్తోంది. మున్సిపాలిటీలో 13 మంది కౌన్సిలర్ల బలం ఉన్నప్పటికీ నాయకత్వ బాధ్యతలు చేపట్టే ఫ్లోర్ లీడర్ లేకపోవడం పార్టీకి రాజకీయంగా ఇబ్బందికర పరిణామమే. ఇకనైనా పార్టీ అధిష్ఠానం జోక్యం చేసుకుని ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>