కలం, వెబ్ డెస్క్ : టాలీవుడ్ యంగ్ హీరో బెల్లకొండ సాయి శ్రీనివాస్ ( Bellamkonda Sai Sreenivas) ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. తిరుమల శ్రీవారి సన్నిధిలో కొద్ది మంది ఆత్మీయుల సమక్షంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వివాహం జరిగింది. పెళ్లి తిరుమలలో ప్రైవేట్ గా జరిగినప్పటికీ హైదరాబాద్ లో రిసెన్షన్ గ్రాండ్ గా జరిగింది. నూతన దంపతులను ఆశీర్వదించడానికి టాలీవుడ్ దిగ్గజాలు తరలివచ్చారు. మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున తదితర సినీ ప్రముఖులు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే వివాహం తర్వాత తన వైవాహిక జీవితంపై బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తొలిసారిగా స్పందించారు.
ఈ మేరకు భార్య కావ్యతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ”నా పెళ్లాం నిప్పురా” అంటూ మాస్ క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్టులో తన భార్యను ఎంతో ప్రేమగా ‘కావ్యమ్మ’ అంటూ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సంభోదించారు. సాధారణంగా సినిమాల్లో మాస్ డైలాగులు చెప్పే శ్రీనివాస్ ఆ తరహాలోనే నిజం జీవితంలోనూ తన భార్యపై ప్రేమను ఈ విధంగా వ్యక్త పరిచారని తెలుస్తోంది. తన భార్యపై ప్రేమను కురిపిస్తూ హీరో బెల్లంకొండ చేసిన తాజా పోస్టు వైరల్ గా మారింది. నెటిజన్లు ఈ జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు.

