Mobile Popup Ad
Mobile Popup Ad

‘SIR’ ను పకడ్బందీగా నిర్వహించాలి: ఎమ్మెల్యే కుంభం

కలం, వలిగొండ: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ పకడ్బందీగా నిర్వహించాలని వలిగొండ ఎమ్మెల్యే (Valigonda MLA) కుంభం అనిల్ కుమార్ రెడ్డి (Kumbam Anil Kumar Reddy) హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా తన స్వగ్రామమైన వలిగొండ మండల కేంద్రంలోని తన ఇంటిలో శనివారం ఎన్యూమరేషన్ పూర్తి చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఎన్నికల అధికారులకు, బూత్ లెవెల్ సిబ్బందికి తనతో పాటు కుటుంబ సభ్యుల వివరాలను అందజేసి నమోదు చేయించారు. ప్రతి అర్హత కలిగిన ఓటరు తమ వివరాలను పరిశీలించి, ఎన్యూమరేషన్ ప్రక్రియకు సహకరించాలని ఎమ్మెల్యే కుంభం ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుంభం వెంకట్ పాపిరెడ్డి, తహశీల్దార్ దశరథ, ఎంపీడీవో జలంధర్ రెడ్డి పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>