కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ మంత్రివర్గం (Telangana Cabinet Meeting) జులై 2న భేటీ కానుంది. ఈ నెల 21న క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని భావించినా అది 23వ తేదీకి వాయిదా పడింది. ఆ తర్వాత అది ఇన్‌ఫార్మల్ క్యాబినెట్ మీటింగుగా అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశంగా ముగిసింది.
15 రోజులకు ఒకసారి సమావేశం కావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు 23 వ తేదీన జరిగిన క్యాబినెట్ భేటీ అయింది. అనంతరం జులై 2వ తేదీన మరోసారి మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

