కలం, వెబ్ డెస్క్: పాక్‌తో జరిగే పోరులో భారత బ్యాటర్లు ఉస్మాన్ తారీక్ (Usman Tariq) బౌలింగ్‌ను జాగ్రత్తగా ఫేస్ చేయాలని టీమిండియా మాజీ స్పిన్నర్ హర్బజన్ సింగ్ హెచ్చరించారు. భారత్–పాకిస్థాన్ మ్యాచ్ ఫలితాన్ని పాకిస్థాన్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ మార్చేయొచ్చని అభిప్రాయపడ్డారు. భారత్ గెలుస్తుందని అంచనా వేస్తూనే, తారిక్ నుంచి గట్టి సవాల్ తప్పదని తెలిపారు. ఆదివారం ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్‌పీఎస్ స్టేడియంలో జరగనున్న ఈ హై–వోల్టేజ్ మ్యాచ్‌పై అంచనాలు ఇప్పటికే తారాస్థాయికి చేరుకున్నాయి.
భారత జట్టుపై పూర్తి నమ్మకం వ్యక్తం చేసిన హర్భజన్, ఒత్తిడి లేకుండా సహజ ఆటతీరుతో ఆడితే విజయం సాధిస్తారని పేర్కొన్నారు. అయితే పాకిస్థాన్ తరఫున బరిలోకి దిగే మిస్టరీ స్పిన్నర్ తారిఖ్‌ను (Usman Tariq) జాగ్రత్తగా ఎదుర్కోవాలని సూచించారు. ప్రస్తుత టోర్నీలో తారిక్ అదరగొడుతున్నారు. రెండు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు, మొత్తం నాలుగు టీ20 అంతర్జాతీయాల్లో 11 వికెట్లు తీసి 7.90 సగటు, 5.93 ఎకానమీతో ఆకట్టుకుంటున్నారు.
అతడి ప్రత్యేక బౌలింగ్ యాక్షన్ ఇప్పటికే పలువురు బ్యాటర్లకు పరీక్షగా మారింది. ఇటీవల ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ సమయంలో కామెరాన్ గ్రీన్ చేసిన సంకేతంతో తారిక్ యాక్షన్‌పై మరోసారి చర్చ మొదలైంది. అయితే గతంలో PSL 9, పీఎస్ఎన్ 10లోనూ ఆయన యాక్షన్ పరిశీలనకు వెళ్లి, రెండు సార్లు అధికారికంగా క్లియర్ అయ్యారు. ఈ అంశంపై గతేడాది స్పందించిన తారిక్, మోచేయిలో సహజంగా ఉండే వంకర వల్లే అపార్థాలు వస్తాయని వివరించారు. పాకిస్థాన్ ల్యాబ్‌ల్లో పరీక్షల అనంతరం తన యాక్షన్‌కు క్లియరెన్స్ వచ్చిందని, తాను త్రో చేయడం లేదన్న పూర్తి నమ్మకం ఉందని తెలిపారు.


