ఇంగ్లండ్ గడ్డపై సూర్యవంశీ ‘ఫ్లాప్’ షో.. ఐపీఎల్ హీరోకి ఏమైంది!

కలం, వెబ్ డెస్క్: ఐపీఎల్‌లో మెరుపు స్ట్రైక్ రేట్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. టూర్ ప్రారంభమై మొదటి మూడు మ్యాచుల్లో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయలేకపోయాడు. మొదటి మ్యాచ్‌లో కేవలం 12 పరుగులు, రెండో మ్యాచ్‌లో 24 పరుగులు, ఇక మూడో మ్యాచ్‌లో కేవలం 8 పరుగులకే పెవిలియన్ చేరి తీవ్రంగా నిరాశపరిచాడు. మూడు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కనీసం 50 పరుగులు కూడా దాటలేకపోవడంతో వైభవ్ ప్రస్తుత ఫామ్‌పై క్రికెట్ వర్గాల్లో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ టెక్నిక్‌ను ఇంగ్లండ్ బౌలర్లు పూర్తిగా పసిగట్టేసారనే టాక్ బలంగా వినిపిస్తోంది. అతని బలహీనతలను టార్గెట్ చేస్తూ ప్రత్యర్థి వ్యూహాలు రచించడంతోనే క్రీజులో నిలదొక్కుకోలేక ఇబ్బంది పడుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి తోడు, అంతర్జాతీయ స్థాయి సవాళ్లను తట్టుకోవడానికి అతనికి వ్యక్తిగతంగా సరైన కోచ్, సరైన గైడెన్స్ లేకపోవడమే ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ యువ ఆటగాడు త్వరగా తన టెక్నిక్‌ను సరిచేసుకుని, తిరిగి ఫామ్‌లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>