కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. చాదర్‌ఘాట్ (Chaderghat) ప్రాంతంలో మూసీ నది పక్కన ఉన్న డెకరేషన్ సామగ్రి గోడౌన్‌లో శుక్రవారం హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా వ్యాపించిన మంటలతో గోడౌన్‌లోని డెకరేషన్ వస్తువులు కాలిపోయాయి. అలాగే, మెకానిక్ షాప్ కు మంటలు అంటుకోవడంతో పదుల సంఖ్యలో కార్లు దగ్ధమయ్యాయి.
దట్టమైన నల్లపొగ చుట్టుపక్కల ప్రాంతాలను కమ్మేయడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సేఫ్టి టీమ్ మంటలను అదుపు చేయడానికి ప్రయత్నాలు చేపట్టాయి. ప్రమాదం ఎలా జరిగిందనే విసయంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఫైర్ యాక్సిడెంట్ లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది.

