కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: పాలమూరు నడిబొడ్డున దివీటిపల్లి కేంద్రంగా ఏర్పాటు కానున్న అమరరాజా సెల్‌ఫోన్ తయారీ పరిశ్రమ శంకుస్థాపన బుధవారం జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) కంపెనీ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో పాలమూరు ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని సీఎం అన్నారు. పారిశ్రామిక అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర శాసనసభ్యులు జి. మధుసూదన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ , మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి, తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ పాల్గొన్నారు.
Read Also: విద్యా శాఖను అందుకే నా దగ్గర పెట్టుకున్నా: సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On: X(Twitter)

