దీక్ష విరమించిన వీహెచ్

కలం, వెబ్ డెస్క్: జాతీయ జనగణనలో ఓబీసీల కుల గణనను కూడా చేర్చాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ సలహాదారు వీ హనుమంతరావు (V Hanumantha Rao) (వీహెచ్) చేపట్టిన నిరాహార దీక్ష విరమించారు. హైదరాబాద్ అంబర్‌పేటలోని తన నివాసం వద్ద రెండు రోజులుగా కొనసాగించిన ఈ దీక్షకు కాంగ్రెస్ నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్దఎత్తున మద్దతు తెలిపారు. దీక్షా శిబిరానికి చేరుకున్న బీసీ జేఏసీ నాయకులు వీహెచ్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ, దేశంలో ఓబీసీల అసలు జనాభా వివరాలు బయటపడాలంటే కుల గణన తప్పనిసరిగా నిర్వహించాలని అన్నారు. కుల గణన ద్వారానే సామాజిక న్యాయం సమర్థంగా అమలవుతుందని పేర్కొన్నారు.

బీసీలకు రాజ్యాంగబద్ధ హక్కులు, సంక్షేమ పథకాల అమలులో సరైన ప్రాధాన్యం కల్పించాలంటే కేంద్ర ప్రభుత్వం జాతీయ జనగణనలో ఓబీసీ కుల గణనను చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీల హక్కుల సాధన కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. దీక్షా కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు హాజరై సంఘీభావం తెలిపారు. అంబర్‌పేట ప్రాంతం నినాదాలతో మార్మోగింది. అనంతరం మద్దతు తెలిపిన అందరికీ వీహెచ్ కృతజ్ఞతలు తెలియజేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>