కుప్పంకు జాతీయ స్థాయిలో గుర్తింపు హర్షణీయం: సీఎం చంద్రబాబు

కలం, వెబ్ డెస్క్: కడప జిల్లా కుప్పంలో చేపడుతున్న ప్రభుత్వ కార్యక్రమాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కడం హర్షణీయమని సీఎం చంద్రబాబు అన్నారు. నానాజీ దేశ్‌ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్-2025 కింద దేశంలో కుప్పం మూడవ స్థానాన్ని సాధించిందని తెలిపారు. ఈ పురస్కారంతో పాటు రూ.1.50 కోట్ల నగదు బహుమతిని గెలుచుకోవడం ఎంతో సంతోషకరమని చెప్పారు. అభివృద్ధికి అంకితభావం తోడైతే ఫలితాలు ఎలా ఉంటాయో కుప్పం నిరూపించిందని అన్నారు. ఈ విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వ ప్రయత్నాలకు పూర్తిగా సహకరిస్తున్న కుప్పం ప్రజలకు ఈ సందర్భంగా సీఎం ధన్యవాదాలు చెప్పారు. ఇదే స్పూర్తితో పని చేసి కుప్పం నియోజకవర్గాన్ని దేశానికే రోల్ మోడల్​గా నిలుపుదామని అన్నారు.

కేంద్ర పంచాయతీ రాజ్‌ శాఖ ఇటీవల ‘జాతీయ పంచాయతీ అవార్డులు-2025’ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో ఏపీకి మొత్తం ఐదు అవార్డులు దక్కాయి. దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు సత్తా చాటగా, ఏపీ మొత్తం 5 అవార్డులు దక్కించుకున్నాయి. ఈ అవార్డులను జూన్‌ 3న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ప్రదానం చేయనున్నట్లు కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ తెలిపింది. ‘సుపరిపాలన’ విభాగంలో విశాఖపట్నం జిల్లా నాథవరం మండలం శృంగవరం గ్రామ పంచాయతీ దేశంలోనే అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మొదటి ర్యాంకును సాధించింది. ప్రజలకు మెరుగైన ేసవలు అందించడంలో ఈ పంచాయతీ దేశానికే ఆదర్శంగా నిలిచింది. దీంతో ‘శృంగవరం’ పంచాయతీకి కేంద్ర ప్రభుత్వం రూ.కోటి నగదు పురస్కారాన్ని ప్రకటించింది.

మహిళా సంక్షేమం, మహిళాఫ్రెండ్లీ కల్పించడంలో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం ‘బొక్కసంపాలెం’ పంచాయతీ దేశంలోనే తొలి స్థానాన్ని కైవశం చేసుకుంది. మహిళల అభివృద్ధికి చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలకు గుర్తింపుగా రూ.కోటి నగదు బహుమతిని కూడా ఈ పంచాయతీ దక్కించుకుంది. ఇక ‘పేదరిక నిర్మూలన’ విభాగంలో కడప జిల్లా ఖాజీపేట మండలం ‘చెముళ్లపల్లి’ పంచాయతీ దేశంలోనే రెండో ర్యాంకు సాధించి, రూ.75 లక్షల నగదు బహుమతి దక్కించుకుంది. ‘ఉత్తమ బ్లాక్‌ పంచాయతీ’ విభాగంలో ‘కుప్పం’ దేశంలోనే మూడవ ర్యాంకు సాధించి రూ.1.50 కోట్ల పురస్కారాన్ని గెలుచుకుంది. ‘మౌలిక సదుపాయాల’ విభాగంలో ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం ‘గుండమాల’ పంచాయతీ 3వ ర్యాంకు సాధించి, రూ.25లక్షల నగదు బహుమతి కైవసం చేసుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>