విమ‌ర్శ‌లే కాదు.. మంచి ప్ర‌తిప‌క్షంగా ఉంటాం: ఉద‌య‌నిధి స్టాలిన్‌

క‌లం, వెబ్‌డెస్క్‌: త‌మిళ‌నాడు (Tamil Nadu) ముఖ్య‌మంత్రిగా విజ‌య్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన నేప‌థ్యంలో ఉద‌య‌నిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) ఎక్స్ వేదిక‌గా ఆయ‌న‌కు విషెస్ చెప్పారు. అలాగే త‌మిళ‌నాడు 17వ‌ శాస‌న‌స‌భలో త‌న‌కు ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా బాధ్య‌త అప్ప‌గించిన డీఎంకే అధ్య‌క్షుడు, త‌న తండ్రి ఎంకే స్టాలిన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఈ పదవిని తనకు కట్టబెట్టిన డీఎంకే ప్రధాన కార్యదర్శికి, శాసనసభ్యులకు, పార్టీ శ్రేణులకు, కరుణానిధి సమకాలికులకు, ముఖ్యంగా తమిళ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నూతన బాధ్యతల్లో వంద‌ శాతం నిబద్ధతతో పని చేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.

తమ పార్టీ అధ్యక్షుడి మార్గనిర్దేశంలో అసెంబ్లీలో, ప్రజాక్షేత్రంలో, సోషల్ మీడియాలో ప్రజల గొంతుకగా నిలుస్తామని ఉదయనిధి పేర్కొన్నారు. కేవలం విమర్శల కోసమే కాకుండా, నిర్మాణాత్మకమైన విమర్శలతో ఒక మంచి ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం, ప్రజలకు మధ్య ఒక వారధిలా ఉంటూ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతామని ఆయన వెల్లడించారు. నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెబుతూనే, ఒక శక్తివంతమైన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నిలబడి అలుపెరగని పోరాటం చేస్తామని ఉదయనిధి స్టాలిన్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>