విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ సెంటర్‌కు శ్రీకారం

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో క్రీడా రంగ అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నం (Vizag) అరిలోవ (Arilova) ప్రాంతంలోని తోటగరువులో.. భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీ.వీ. సింధు (PV Sindhu) ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న’సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్‌లెన్స్’ నిర్మాణ పనులకు రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh), రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి బుధవారం భూమిపూజ చేశారు.

శిలాఫలకాన్ని ఆవిష్కరించిన నారా లోకేశ్, అకాడమీ భవన నమూనాను పరిశీలించారు. అలాగే క్రీడాకారులకు అందుబాటులోకి రానున్న అత్యాధునిక శిక్షణా సౌకర్యాలు, వసతి ఏర్పాట్లు, అంతర్జాతీయ ప్రమాణాల మౌలిక వసతులపై అధికారులను, నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. పీవీ సింధు (PV Sindhu) వంటి అంతర్జాతీయ క్రీడాకారిణి ఆధ్వర్యంలో ఏర్పడుతున్న ఈ సెంటర్.. యువ క్రీడాకారులకు ఉత్తమ శిక్షణ అందించి, భవిష్యత్తులో మరెంతో మంది అంతర్జాతీయ స్థాయి ఛాంపియన్లను తీర్చిదిద్దే కేంద్రంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>