ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తల్లి కన్నుమూత

కలం, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి (Yogi Adityanath Mother) సావిత్రి దేవి కన్నుమూశారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పౌరీ గఢ్వాల్ జిల్లా యమకేశ్వర్ బ్లాక్ పరిధిలో ఉన్న తమ స్వగ్రామమైన పంచూర్‌లో ఆమె తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

తల్లి మరణవార్త తెలుసుకున్న సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతికి లోనయ్యారు. తన అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని స్వగ్రామం పంచూర్‌కు బయలుదేరారు. ఆమె అంత్యక్రియలు స్వగ్రామంలోనే నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. సావిత్రి దేవి మృతి పట్ల ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : మోదీ విజిటింగ్ ప్రైమ్ మినిస్టర్ : సీఎం రేవంత్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>