రణరంగంగా తాడిపత్రి.. వాహనాలకు నిప్పు, ఫర్నీచర్ ధ్వంసం!

కలం, వెబ్ డెస్క్ : అనంతపురం జిల్లా తాడిపత్రి (Tadipatri)లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. నిన్నటి నుంచి తాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్లపై దాడులు జరుగుతున్నాయనే ఆరోపణలతో, ఈరోజు ఉదయం మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆగ్రహానికి గురైన జేసీ వర్గీయులు పెద్దారెడ్డి నివాసంపై విరుచుకుపడ్డారు.

వాహనాలు ధ్వంసం, బైకులకు నిప్పు

ఈ దాడిలో పెద్దారెడ్డికి చెందిన సుమారు 10 స్కార్పియో వాహనాలను దుండగులు పూర్తిగా ధ్వంసం చేశారు. అంతేకాకుండా, ఇంటి ఆవరణలో ఉన్న సుమారు 20 బైకులకు నిప్పు పెట్టడంతో అవి మంటల్లో కాలిబూడిదయ్యాయి. ఇంటి లోపలికి చొరబడి అద్దాలు, ఫర్నీచర్‌ను సైతం ధ్వంసం చేశారు.

ఇతర నేతల ఇళ్లపైనా దాడులు

పెద్దారెడ్డి నివాసంతో పాటు ఇతర వైఎస్సార్‌సీపీ నేతలు నరసింహారెడ్డి, సూరి ఇళ్లపైనా దాడులు జరిగాయి. ఆయా ప్రాంతాల్లోనూ రెండు కార్లను దుండగులు ధ్వంసం చేశారు. వరుస దాడులు, వాహనాల దహనంతో తాడిపత్రి పట్టణంలో భయానక వాతావరణం ఏర్పడింది. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటంతో పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>