కలం, వెబ్ డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ మార్చి 19న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లలో డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) చాలా బిజీగా ఉంటున్నారు. తాజాగా ఆయన ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ.. ఉస్తాద్ భగత్ సింగ్ జనరల్ ఆడియెన్స్ కు బాగా నచ్చుతుందన్నారు. ‘జనరల్ ఆడియెన్స్ ఇలాంటి ఎంటర్ టైనింగ్ సినిమా చూసి చాలా కాలం అయిందని అంటారు. ఇందులో యాక్షన్ తో పాటు ఎమోషన్ చాలా ఇంపార్టెంట్. ఆ రెండింటినీ ఎంటర్ టైన్ మెంట్ తో మిక్స్ చేశాం’ అని హరీష్ వెల్లడించారు.
ఈ సినిమాకు కచ్చితంగా రిపీటెడ్ ఆడియెన్స్ ఉంటారని.. మళ్లీ మళ్లీ చూస్తారని హరీష్ శంకర్ తెలిపారు. ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో అవన్నీ ఉస్తాద్ భగత్ సింగ్ లో ఉంటాయని హరీష్ శంకర్ (Harish Shankar) క్లారిటీ ఇచ్చారు. చాలా కాలం తర్వాత పవన్ కల్యాణ్ ఒక ఎనర్జిటిక్ రోల్ తో అందరి ముందుకు వస్తున్నారని హరీష్ శంకర్ చెప్పారు. ఆయన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలపై కొందరు నెగెటివ్ కామెంట్స్ కూడా పెడుతున్నారు. దీంతో హరీష్ శంకర్ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

