కలం, ఖమ్మం బ్యూరో : వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) కి గురజాల కోర్టు (Gurajala Court) బెయిల్ మంజూరు చేసింది. టీడీపీ నేతల హత్య కేసులో ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసు నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైల్లో 98 రోజుల పాటు రిమాండ్‌లో ఉన్నారు. తాజాగా గురజాల కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయనకు ఉపశమనం లభించింది. ఈ పరిణామంతో రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేసు తదుపరి విచారణ కొనసాగనుంది.

