కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మానవ సంబంధాలు మంట కలిపే విధంగా ఉన్న ఈ ఘటనతో తెలంగాణ సమాజం ఒక్కసారిగా ఉలిక్కిపడుతోంది. ఏకంగా స్వంత అక్కనే తమ్ముడు దారుణంగా చంపి హతమార్చాడు (Brother Murders Sister). చెడు తిరుగుళ్లు తిరుగుతుందని.. చెప్పిన మాట వినట్లేదని ఆగ్రహంతో ఊగిపోయిన తమ్ముడు.. అక్కని చంపి ముక్కలు చేసి చెరువులో పడవేశాడు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
కొన్నాళ్ల క్రితం బావ చనిపోయిన తర్వాత అక్క ప్రవర్తన సరిగా లేదనే కోపంతో రెండు భాగాలుగా చేసి మజీత్ పూర్ చెరువులో పడేశాడు. గత నెల 28 నాడు బాటసింగారం కిరణం షాపు నుండి తప్పిపోయిందని పోలీస్ స్టేషన్‌లో ఏమి తెలియనట్లు తమ్ముడు పప్పు రామ్ ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాపు చేపట్టారు.ఈ క్రమంలోనే హత్య (Brother Murders Sister) వ్యవహారం బయటపడింది. పలు ఆధారాలు లభించిన పోలీసులు, నిజాలు తెలుసుకొని విస్తుపోయారు. తమ్ముడే ఈ ఘోరానికి పాల్పడ్డట్లు వెల్లడించారు. స్థానికంగా అలజడి రేపిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

