బర్త్ టూరిజంపై అమెరికా సంచలనం.. 600 వీసాలు రద్దు!

కలం, వెబ్ డెస్క్​ : బర్త్ టూరిజం నియంత్రణకు అమెరికా ప్రభుత్వం (US Birth Tourism) సంచలన నిర్ణయం తీసుకుంది. గర్భంతో ఉన్న మహిళలు తమ దేశంలో ప్రసవించి, జన్మించిన పిల్లలకు అమెరికా పౌరసత్వం పొందే క్రమాన్ని అడ్డుకునేందుకు కఠిన చర్యలు చేపట్టింది. ఒక్క జూలై నెలలోనే తొమ్మిదో నెల గర్భంతో అమెరికాకు వచ్చిన 600 మంది విదేశీ మహిళల వీసాలను అధికారులు రద్దు చేశారు.

పర్యాటక వీసాలపై అమెరికా వచ్చి ప్రసవాలు జరిపే ధోరణి ఇటీవల పెరిగింది. స్థానికంగా జన్మించిన పిల్లలకు నిబంధనల ప్రకారం లభించే హక్కులను దుర్వినియోగం చేస్తున్నారని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ అధికారులు గుర్తించారు. గర్భిణులుగా ఉన్న విషయాన్ని, ప్రయాణ అసలు ఉద్దేశాలను దాచిపెట్టి వచ్చిన వారిని సరిహద్దుల వద్దే గుర్తించి ఈ చర్యలు తీసుకున్నారు.

ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై తనిఖీలు తీవ్రం చేశామని అధికారులు వెల్లడించారు. మున్ముందు బర్త్ టూరిజం (US Birth Tourism) నిరోధానికి ప్రవేశ మార్గాల వద్ద మరింత కఠినమైన రూల్స్ అమలు చేస్తామని స్పష్టం చేశారు. విసా నియమాలను ఉల్లంఘిస్తే భవిష్యత్తులో దేశ ప్రవేశంపై శాశ్వత నిషేధం విధించే అవకాశముందని హెచ్చరించారు.

Also Read : క్యాబ్ యాప్‌లకు షాక్.. అడ్వాన్స్ టిప్ ఆప్షన్లకు చెక్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>