రాయదుర్గ్ భూముల వేలం ఆపాలి.. సీఎంకు హరీశ్ రావు లేఖ

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని రాయదుర్గ్ భూముల వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) బహిరంగ లేఖ రాశారు. రాయదుర్గ్ సర్వే నంబర్ 83/1లోని 10.63 ఎకరాల భూమికి ఆగస్టు 17, 21 తేదీల్లో ప్రతిపాదించిన టీజీఐఐసీ (TGIIC) వేలాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఇదివరకే సర్వే నంబర్ 83ను హెరిటేజ్ సైట్ గా ప్రకటించారని.. అలాగే ఈ భూమిపై ఎస్బీఐ, వక్ఫ్ (Waqf) హక్కులకు సంబంధించిన వివాదాలు ఇప్పటికే కోర్టుల్లో పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. ఈ వివాదాలు పరిష్కారం కాకముందే థర్డ్ పార్టీ రైట్స్ ఏర్పడకుండా చూడాలని సుప్రీం కోర్టు ఆదేశించిందని వివరించారు.

2020లో రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాయదుర్గ్ భూములకు ( Raidurg Land Auction) రక్షణ కోరుతూ కోర్టును ఆశ్రయించారని గుర్తు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అదే భూములపై వేలం నిర్వహించేందుకు ఎలా అనుమతిస్తారని నిలదీశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ పర్యావరణ భూముల నుంచి రాయదుర్గ్ హెరిటేజ్ రాక్ భూముల వరకు రాష్ట్రంలోని విలువైన ప్రభుత్వ ఆస్తులు ప్రమాదంలో పడుతున్నాయని రాసుకొచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>