Mobile Popup Ad
Mobile Popup Ad

వడ‌గండ్ల వాన‌లు.. పంట‌ల‌కు తీవ్ర న‌ష్టం!

క‌లం, వెబ్ డెస్క్‌: తెలంగాణ‌ (Telangana)లోని ప‌లు జిల్లాల్లో అకాల వ‌ర్షాలు (Unseasonal Rains) కురుస్తున్నాయి. ఎండాకాలం నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి నుంచి కురుస్తున్న వ‌ర్షాల‌తో న‌గ‌ర ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగిన‌ప్ప‌టికీ, గ్రామీణ ప్రాంతాల్లో పంట‌ల‌కు తీవ్ర న‌ష్టంగా మారుతోంది. కామారెడ్డి, వికారాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, నాగర్‌కర్నూల్, గద్వాల, ఆదిలాబాద్ త‌దిత‌ర‌ జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, నిజామాబాద్ జిల్లాల్లో వడగండ్లు ప‌డ్డాయి. దీంతో ఆయా జిల్లాల్లో పంట‌ల‌కు తీవ్ర న‌ష్టం వాటిల్లింది. ప‌లు జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న‌ ధాన్యం త‌డిసిపోయింది. పంటలు తీవ్రంగా దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌స్తుతం వ‌ర్షాలు ప‌డ్డ‌ జిల్లాలతో పాటు మ‌రిన్ని జిల్లాల‌కు వర్ష సూచనలు ఉన్నాయ‌ని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>